HomeTelugu Big StoriesMr Bachchan: అసలు ఛార్మీ-రవితేజ మధ్య గొడవ ఏమిటి?

Mr Bachchan: అసలు ఛార్మీ-రవితేజ మధ్య గొడవ ఏమిటి?

Mr Bachchan reason behind a split
Mr Bachchan reason behind a split

Mr Bachchan Teaser:

ఇండస్ట్రీలో ఒక ఇద్దరు స్నేహితులుగా ఉండటం చాలా కష్టమైన విషయం. ఎన్నో ఏళ్లుగా ఉన్న స్నేహం కూడా చిన్నచిన్న విషయాల వల్ల చెడిపోతూ ఉంటుంది. తాజాగా మాస్ మహారాజా రవితేజ చార్మికౌర్ ల మధ్య స్నేహం లో కూడా చిచ్చులు వచ్చాయి.

సోషల్ మీడియాలో రవితేజని చార్మి అన్ ఫాలో చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రవితేజ చార్మిల మధ్య స్నేహం ఇప్పటిది కాదు. 20 ఏళ్ల క్రితమే ఇద్దరు చంటి అనే సినిమాలో కలిసి నటించారు. అప్పటినుంచి ఈ వీరి స్నేహం పెరుగుతూనే వచ్చింది కానీ తగ్గలేదు.

కానీ తాజాగా వీళ్లిద్దరి మధ్య స్నేహానికి అడ్డంకులు వచ్చాయి. వివరాల్లోకి వెళితే చార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్టు 15న విడుదల అవుతుంది అని ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి ఆగస్టు ఆఖరిలో విడుదల కావలసిన ఈ సినిమా పుష్ప 2 వాయిదా పడటం వల్ల.. ప్రీ పోన్ అయ్యింది.

అయితే రవితేజ తన మిస్టర్ బచ్చన్ సినిమాని కూడా అదే రోజున విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వీళ్లిద్దరి మధ్య క్లాష్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే మిస్టర్ బచ్చన్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న హరీష్ శంకర్ ఈ చిచ్చు కి కారణం అని కొందరు అంటున్నారు.

కానీ తాజాగా జరిగిన మిస్టర్ బచ్చన్ టీజర్ లాంచ్ ఈవెంట్లో హరీష్ శంకర్ తనకేమీ సంబంధం లేదని చేతులు దులిపేస్తున్నారు. ఇంకా ఆసక్తికరంగా రామ్ హీరోగా తను ఒక సినిమా చేస్తున్నాను అని.. కాబట్టి కావాలని తనకి ఆపోజిట్ గా వెళ్ళను అని అన్నారు హరీష్ శంకర్. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్.. రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ లు అవ్వాలి అని చెప్పారు హరీష్ శంకర్.

హరీష్ శంకర్ చెప్పినది బాగానే ఉన్నా ఛార్మీ, రవితేజ ల మధ్య స్నేహం మాత్రం చెడింది. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu