Mr Bachchan OTT:
రవి తేజ నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ Mr Bachchan హరిష్ శంకర్ దర్శకత్వంలో ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం బాలీవుడ్ మూవీ రైడ్ కి రీమేక్. అయితే, ఈ చిత్రం మొదటి రోజు నుంచి డిజాస్టర్ టాక్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదలకు సిద్ధమైంది. అయితే థియేటర్లలో డిజాస్టర్ టాక్ అందుకున్న ఈ ఈ సినిమాని చాలా రోజులు ట్రోల్ చేస్తూనే ఉన్నారు.
ఆగస్టు 15న విడుదలైన పెద్ద సినిమా కాబట్టి ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి కానీ.. అందులో ఒక్క అంచనాన్ని కూడా సినిమా అందుకోలేకపోయింది. దీంతో సినిమా మీద తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు ఈ సినిమా ఓటిటి విడుదల కి సిద్ధం అవుతూ ఉండడంతో.. ఈ సినిమాతో పాటు రవితేజ మీద మరొకసారి ట్రోలింగ్ జరుగుతుంది అని ఫాన్స్ బాధపడుతున్నారు.
ఇప్పటికే రవితేజ సినిమా సెలక్షన్ మీద ఫాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మిస్టర్ పర్చన్ సినిమా తర్వాత కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా రవితేజ కి డైరెక్ట్ గానే.. ఈ విషయాన్ని తెలియజేశారు. మరి ఓటిటి విడుదల తర్వాత సినిమా మీద మరొక సారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలవుతుంది అని చెప్పుకోవచ్చు.
ఇక ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్స్ మొదటిసారిగా టాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఇండియా రూ. 33 కోట్లకు కొనుగోలు చేసింది.. కానీ థియేట్రికల్ విడుదల తర్వాత ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్ అయ్యింది.
ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ OTT ప్లాట్‌ఫామ్ ద్వారా త్వరలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 12 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం. అధికారిక ప్రకటన మాత్రం ఇంకా బయటకి రావాల్సి ఉంది.
ఈ సినిమాలో రవి తేజ, అభిమన్యు సింగ్, భాగ్యశ్రీ బోర్స్, సుభలేఖ సుధాకర్, కిషోర్ రాజు వాసిష్ఠ వంటి నటీనటులు ప్రధాన పాత్రలలో నటించారు. వివేక్ కుచిబోట్ల, టి.జి. విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జే. మేయర్ సంగీతం అందించారు.