HomeTelugu Big StoriesAugust releases: మరొకసారి టాలివుడ్ లో సినిమాల వర్షం

August releases: మరొకసారి టాలివుడ్ లో సినిమాల వర్షం

So many movies releasing on August 2nd
So many movies releasing on August 2nd

August Upcoming Movies:

ఆగస్టు నెల మొదలవుతోంది. ఆగస్టులో వర్షాలు పడతాయో లేదో తెలియదు కానీ సినిమాల వర్షం మాత్రం బాగానే కురుస్తుందని చెప్పవచ్చు. ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆగస్టు మొదటి వారంలో కూడా బోలెడు సినిమాలు విడుదల చేసేద్దాం అవుతున్నాయి. ఆగస్టు ఒకటి రెండవ తేదీలలో విడుదల కాబోతున్న సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.

శివం భజే:

అశ్విన్ బాబు హీరోగా నటించిన క్రైమ్ ట్రైలర్ శుభం భజే ఆగస్టు 1న విడుదల కాబోతోంది. ఆగస్టు 2న ఇంకా చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. అందుకే తెలివిగా అశ్విని తన సినిమాని ఆగస్టు మొదటికి విడుదల చేస్తున్నారు.

బడ్డీ:

అల్లు శిరీష్ హీరోగా నటించిన బడ్డీ సినిమా ఒక విభిన్న కాన్సెప్ట్ తో ఆగస్టు 2 న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. టెడ్డీబేర్ కి ప్రాణం ఉంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ మీద ఈ సినిమా రన్ అవుతుంది. ఇందులో అల్లు శిరీష్ ఒక పైలెట్ పాత్రలో కనిపించబోతున్నారు. గత రెండు వారాలుగా సినిమాని భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

తిరగబడరా సామి:

గత కొద్ది రోజులుగా వివాదాలతో పాపులర్ అయిన రాజు తరుణ్ హీరోగా నటిస్తున్న తిరగబడరా సామి కూడా ఆగస్టు 2న విడుదల కాబోతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తముడు సినిమా కూడా ఈ మధ్యనే విడుదల ఇంకా థియేటర్లలోనే ఉంది. ఈ సినిమా ఫైనల్ రన్ పూర్తికాకముందే రాజ్ తరుణ్ మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.

విరాజి:

ఈ మధ్యనే నింద సినిమాతో కనిపించిన వరుణ్ సందేశ్ ఇప్పుడు విరాజి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఆగస్టు 2న ఆ విడుదల కాబోతోంది.

ఉషా పరిణయం:

ప్రముఖ డైరెక్టర్ విజయభాస్కర్ తెరకెక్కిస్తున్న ఉషా పరిణయం సినిమా ఆగస్టు 2న విడుదలవుతుంది. విజయ్ భాస్కర్ తనయుడు శ్రీ కమల్ ఈ సినిమాలో హీరోల నటిస్తున్నారు. జిలేబి అనే సినిమాతో హీరోగా మారిన శ్రీ కమల్ ఇప్పుడు ఈ సినిమా తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

తూఫాన్:

బిచ్చగాడు ఫ్రేమ్ విజయ్ ఆంటోనీ త్వరలో తుఫాన్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. తమిళ్ సినిమాకి డబ్బింగ్ గా ఈ చిత్రం ఆగస్టు 2న విడుదలవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయ్ ఆంటోనీ ఈ సినిమాని భారీగా ప్రమోట్ చేస్తున్నారు

అలనాటి రామచంద్రుడు:

చిన్న సినిమాగా అలనాటి రామచంద్రుడు ఈమధ్య సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా కూడా ఆగస్టు 2న ఆ విడుదలవుతుంది.

ఎవరి స్టూడెంట్ నాని, లారీ అనే మరొక రెండు సినిమాలు కూడా అదే రోజు విడుదలవుతున్నాయి. బాలీవుడ్ లో జాన్వి కపూర్ ఉలజ్ అదే రోజు విడుదల కి సిద్ధంగా ఉంది. మరి వీటిలో ఎన్ని సినిమాలు ప్రేక్షకులను అలరిస్తాయో వేచి చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu