ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు కూతురు అమృత, అల్లుడు ప్రణయ్‌ల ప్రేమ కథ ఆధారంగా శివనాగేశ్వర్ రావు అనే కొత్త డైరెక్టర్ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో నటించినున్న వారి పేర్లు బయటకు వచ్చాయి.
ఇందులో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజతో పాటు బాలాదిత్య, అర్చన నటించనున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుందని బాలాదిత్య మీడియాకు తెలిపాడు. నిజజీవిత కథతో పాటు కొంత కల్పిత కథను కూడా చేర్చి ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. బాలాదిత్య సరసన అర్చన నటిస్తోంది. ఈ సినిమాకి ఎంఎన్‌ఆర్ చౌదరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’ అనే పేరును ఖరారు చేశారు. అయితే ఇటువంటి అంశలపై సినిమాలు తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మ ముందుటాడు. కాగా ఈ కథపై అటువంటి స్పందన లేదు.. బహుశ ఈ కథ వర్మకు నచ్చలేదేమో. తాజాగా దిశ ఆత్యాచార సంఘటనపై ఓ చిత్రం చేయబోతున్నట్లు వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే.