HomeTelugu Big StoriesMovie Theaters: మూవీ ల‌వ‌ర్స్‌కు బ్యాడ్ న్యూస్.. బంద్ ఎన్నిరోజులంటే?

Movie Theaters: మూవీ ల‌వ‌ర్స్‌కు బ్యాడ్ న్యూస్.. బంద్ ఎన్నిరోజులంటే?

Telangana Movie Theaters Movie Theaters: సాధారణంగా సమ్మర్‌లో ఎక్కువగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. స్టార్ హీరోల కూడా తమ సినిమాలను ఎక్కువగా వేసవి సెలవులతో విడుదల చేసేందుకు పోటీ పడుతూ ఉంటారు. ఈ సీజన్‌లో విడులైన సినిమాకి మిక్సిడ్‌ టాక్‌ వచ్చిన మంచి కలెక్షన్స్‌ రాబడతాయి. అయితే ఈ సమ్మర్ సీజన్ సినీ పరిశ్రమకు భారీ ఎఫెక్ట్ చూపించింది అనే చెప్పాలి.

ఎందుకంటే.. ఈ ఏడాది వేసవిలో.. ఓ వైపు ఎన్నికలు, మరోవైపు ఐపీఎల్ ఉండటం వల్ల భారీ సినిమాలు, స్టార్ హీరోల చిత్రాలు సమ్మర్ నుంచి వాయిదా వేసుకున్నారు. దీంతో చిన్న సినిమాలే థియేటర్స్​లో విడుదల అయ్యాయి కానీ అవి అంతగా ఆకట్టుకోవట్లేదు. అదే సమయంలో ఆడియెన్స్​ కూడా పెద్దగా థియేటర్లకు రావట్లేదు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ థియేటర్లకు పెద్దగా రావట్లేదు. వచ్చే కొద్ది మంది ఆడియెన్స్​ ద్వారా వస్తున్న వసూళ్లు కరెంట్, అద్దెలకు కూడా సరిపోవట్లేదని అంటున్నారు. ఈ క్రమంలోనే సింగిల్ స్క్రీన్ ​థియేటర్స్ భారీ నష్టాలని చూస్తున్నాయని సమాచారం అందుతోంది.

దీంతో  సినిమా ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్ ప్రకటించారు థియేటర్ యాజమాన్యాలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పదిరోజుల పాటు సినిమా ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రదర్శనలు ఆపివేస్తామని తెలిపారు. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటం వల్లే సినిమా ప్రదర్శనలు ఆపాలని తాము నిర్ణయించినట్లు వెల్లడించారు. సినిమా ప్రదర్శనల వల్ల లాభం సంగతేమో కానీ నష్టం ఎక్కువ వస్తుందని థియేటర్ యాజమాన్యాలు వాపోతున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల స్వచ్ఛందంగా ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. నిర్మాతలు ప్రోత్సహించి థియేటర్ అద్దెలు పెంచాలన్న కోరాయి. పరిస్థితులు అనుకూలిస్తే ప్రదర్శనలు కొనసాగిస్తామని స్పష్టం చేశాయి.

కాగా, గత రెండు వారాల్లో విడుదలైన ఆ ఒక్కటి అడక్కు, బాక్​, ప్రసన్నవదనం, శబరి, కృష్ణమ్మ వంటి చిత్రాలు రిలీజ్ అవ్వగా అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక ఈ వారం మే 17న గెటప్ శ్రీను రాజు యాదవ్​తో పాటు అపరిచితుడు రీరిలీజ్ కానున్నాయి. వీటితో పాటు దర్శిని, నటరత్నాలు అనే మరో రెండు సినిమాలు వస్తున్నాయి.

క‌రోనా లాక్‌డౌన్ టైంలో దేశమంతటా థియేట‌ర్‌లు మూతపడిన విష‌యం తెలిసిందే. కరోనా టైమ్ లో అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది అంటే సినీ ఇండస్ట్రీ అని చెప్పక తప్పదు. అయితే అలాంటి పరిస్థితి మ‌ళ్లీ తెలంగాణలో రావడం మూవీ లవర్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌ అనే చెప్పాలి.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu