
టాలీవుడ్ కమెడియన్, వైసీపీ నేత అలీకి ఎట్టకేలకు ప్రభుత్వ పదవి దక్కింది. ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా అలీ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో అలీ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ఇతర ప్రభుత్వ సలహాదారుల మాదిరిగానే అలీకి 3లక్షల వరకు జీతం , అదనంగా కొన్ని అలవెన్సులు లభించనున్నాయి.
2019 ఎన్నికలకు ముందే వైసీపీలో చేరిన అలీ… పలువురు సినీ నటులను వైసీపీకి చేరువ చేశారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి ఆయనకు మంచి పదవే దక్కుతుందని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని, ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది.














