
Sharmin Segal Properties:
సినీ కుటుంబాలకు చెందిన ఎంతో మంది బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. కొందరు నటులుగా, మరికొందరు దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో సంజయ్ లీలా భన్సాలీ మేనకోడలు శర్మిన్ సెగల్ కూడా ఒకరు. ఈమె తొలుత అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి, ఆ తర్వాత హీరోయిన్‌గా మారింది.
శర్మిన్ సెగల్ బాలీవుడ్‌లో తన కెరీర్‌ను అసిస్టెంట్ డైరెక్టర్‌గా మొదలుపెట్టింది. రణవీర్ సింగ్, దీపికా పదుకోణె నటించిన చిత్రాల్లో పని చేసింది. ఆ తర్వాత 2019లో భన్సాలీ ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన ‘మలాల్’ చిత్రంతో హీరోయిన్‌గా తెరపైకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
‘మలాల్’ తర్వాత శర్మిన్ ‘అతిథి భూతో భవా’ అనే సినిమాలో నటించింది, కానీ అది కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే, 2024లో వచ్చిన ‘హీరామండి: ది డైమండ్ బజార్’ వెబ్ సిరీస్‌లో శర్మిన్ కీలక పాత్ర పోషించింది. ఈ సిరీస్ ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన పొందింది. కానీ ఇందులో శర్మిన్ నటనపై సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది.
శర్మిన్ కుటుంబం బాలీవుడ్‌లో ఒక ప్రతిభావంతమైన కుటుంబంగా గుర్తింపు పొందింది. ఆమె తండ్రి దీపక్ సెగల్ సినీ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తుంటే, తల్లి బెలా సెగల్ ఫిల్మ్ ఎడిటర్. బెలా, సంజయ్ లీలా భన్సాలీ చెల్లెలు కావడంతో, శర్మిన్ భన్సాలీ మేనకోడలు. అంతేకాదు, ఆమె తాత మోహన్ సెగల్ కూడా ప్రముఖ దర్శకుడు.
2023లో శర్మిన్ సెగల్ అమన్ మెహతా అనే ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. అమన్, టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అతని కుటుంబ సంపద దాదాపు ₹53,800 కోట్లుగా అంచనా.