HomeTelugu Big Stories‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ట్రైలర్‌

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ట్రైలర్‌

Most eligible bachelor thea
అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’.. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. లవ్‌, కామెడీ అంశాలతో ఆసక్తిగా రేకెత్తించిన ఈ ట్రైలర్‌లో అఖిల్, పూజా హెగ్డే జోడీ స్క్రీన్ ఫెయిర్ బాగుంది. మ్యారీడ్‌ లైఫ్‌ బాగుండాలంటే కెరీర్‌ బాగుండాలి అంటూ అఖిల్ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. ఇక పూజా హెగ్డే, అఖిల్ కు పూర్తి భిన్నంగా ఉన్నట్లు ట్రైలర్ బట్టి తెలుస్తోంది. ఇక ట్రైలర్ మధ్యలో జాతిరత్నాలు ఫ్రేమ్ ఫరియా, ఈషా రెబ్బా కనిపించారు.

బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకి అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ రూపొందిస్తున్నారు. ఈ మూవీని బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దసరా పండుగ సందర్బంగా అక్టోబర్ 15న థియేటర్లోకి రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu