HomeTelugu Trendingఅమ్మా నీ దగ్గర ఫోన్‌ ఉంది.. ఆపు.. నెటిజన్లు చూస్తున్నారు

అమ్మా నీ దగ్గర ఫోన్‌ ఉంది.. ఆపు.. నెటిజన్లు చూస్తున్నారు

11 19

‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాలో తన కుమార్తె రష్మిక నటన చక్కగా ఉందని ఆమె తల్లి సుమన్‌ ప్రశంసించారు. ఈ మేరకు ఆమె ట్వీట్లు చేశారు. ‘ప్రియమైన లిల్లీ (పాత్ర పేరు). నువ్వు నీ తల్లిదండ్రులు గర్వపడేలా చేశావు. ఎంచుకున్న రంగంలో నువ్విలా వృద్ధి చెందుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. లవ్‌ యూ బేబీ రష్మిక. నిజంగా అద్భుతంగా నటించావు. నీ తర్వాతి చిత్రాలకు ఆల్‌ ది బెస్ట్‌. మైత్రి మూవీ మేకర్స్‌కు ధన్యవాదాలు’ అని ట్వీట్‌ చేశారు. దీనికి రష్మిక రిప్లై ఇచ్చారు. ‘థాంక్యూ అమ్మా.. లవ్‌ యూ టూ. ఇప్పుడు మా టీంతో కలిసి మరోసారి సినిమా చూడు. న్యూ వెర్షన్‌ ఎలా ఉందో చెప్పు’ అని పోస్ట్‌ చేశారు.

సుమన్‌ అక్కడితో సంభాషణను ఆపకుండా… ‘అందరి సంతోషం కోసం ఇలానే కష్టపడు. మా ఆశీర్వాదాలు నీకెప్పుడూ ఉంటాయి. నటిగా ఈ ప్రయాణాన్ని ఎంజాయ్‌ చెయ్‌’ అని మళ్లీ ట్వీట్‌ చేశారు. దీంతో రష్మిక సరదాగా ప్రతిస్పందించారు. ‘అమ్మా.. నీ దగ్గర ఫోన్‌ ఉందనే విషయాన్ని గుర్తుచేసుకో, నాకూ ఫోన్‌ ఉంది. నేను తీరికగా ఉన్నాను కాల్‌ చెయ్‌. నెటిజన్లు ట్వీట్లు చదువుతున్నారు. వారికి ఇబ్బందికరంగా ఉంటుంది’ అని పోస్ట్‌ చేశారు. ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాలో విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. భరత్‌ కమ్మ దర్శకుడు. ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. ప్రత్యేకించి రష్మిక పాత్ర, నటనను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. కొత్తగా ఈ సినిమాకు క్యాంటీన్‌ పాటను జోడించి, విడుదల చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu