నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ హీరో ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతని ఎంట్రీ ఎలా ఉండబోతుంది. ఎలాంటి కథతో వస్తున్నాడు? ఏ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు? అనే ప్రశ్నలు ప్రతీ నందమూరి అభిమానుల మదిల్లో మెదులుతున్నాయి. బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’ టైమ్‌లో మోక్షజ్ఞ పలు సార్లు సెట్స్‌లో సందడి చేశాడు. ఆ టైమ్‌లో మోక్షజ్ఞ భారీ కాయాన్ని చూసి అందరూ విమర్శలు చేశారు.
అయితే నెలల గ్యాప్‌లోనే సన్నగా మారి హాలీవుడ్ హీరోలా ఆ మధ్య కనిపించాడు. ఇక ఇటీవలే నందమూరి ఫ్యామిలీ ఫంక్షన్‌లోనూ మోక్షజ్ఞ న్యూలుక్ తో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్‌రామ్, తారక్‌లతో కలిసి సందడి చేసిన ఫోటోలు నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచాయి. తాజాగా మోక్షజ్ఞ మరోసారి ట్రెండ్ అవుతున్నాడు. తాజాగా మోక్షజ్ఞ బాలయ్య నటిస్తున్న భగవతంత్ కేసరి షూటింగ్‌లో సందడి చేశాడు. శ్రీలీలతో కబుర్లు పెడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాకుండా పక్కనే చేతులు కట్టుకుని నిల్చున్న అనీల్‌ను ట్యాగ్ చేస్తూ వీళ్లద్దరి కాంబోలో సినిమా సెట్ చేయండంటూ కామెంట్స్ చేస్తున్నారు. బ్లాక్ కలర్ షేడ్స్ పెట్టుకుని సెట్స్‌లో సందడి చేశాడు.
దసరా టార్గెట్‌గా విడుదల కాబోతున్న భగవంత్ కేసరిలో శ్రీలీల కీలకపాత్ర చేస్తుంది. అనీల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్ నందమూరి అభిమానుల్లో వీర లెవల్లో అంచనాలు క్రియేట్ చేశాయి. కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ సంస్థ నిర్మిస్తుంది.