HomeTelugu Big StoriesMokshagna మొదటి సినిమాకే ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడా?

Mokshagna మొదటి సినిమాకే ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడా?

Mokshagna 's shocking remuneration for his debut film
Mokshagna ‘s shocking remuneration for his debut film

Mokshagna debut movie remuneration:

నందమూరి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రోజులు రానే వచ్చాయి. నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ.. ఇప్పుడు హీరోగా మారబోతున్నాడు. హను మ్యాన్ సినిమాతో ప్యాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ ఇలాంటి క్రేజీ కాంబినేషన్లో సినిమా కాబట్టి.. ఈ సినిమా మీద అంచనాలు ఇంకా పెరిగిపోయాయి.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, లెజెండ్ సినిమాస్ బ్యానర్ లపై చెరుకూరి సుధాకర్, మతుకుమల్లి తేజస్విని సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కమర్షియల్ కథకు మైథాలజీని జోడించి ప్రశాంత్ వర్మ రాసుకున్న కథ ఇది. బాలయ్యకి చాలా బాగా నచ్చడంతో మోక్షజ్ఞ డెబ్యూ సినిమాని వర్మ చేతిలో పెట్టేశారు. ఈనెల 6వ తేదీన మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా విడుదల అయిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.

అయితే మొదటి సినిమాకే మోక్షజ్ఞ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డెబ్యు సినిమా కోసం మోక్షజ్ఞ ఏకంగా 20 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లు సమాచారం. ఎంత స్టార్ కిడ్ అయినా కూడా.. మొదటి సినిమాకి ఈ రేంజ్ రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. ఇక ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

సినిమా ఎలా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కలిసి సంయుక్తంగా.. సినిమాని బ్లాక్ బస్టర్ చేస్తాయి అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా పూర్తవగానే బాలకృష్ణ మోక్షజ్ఞ కోసం మరొక రెండు సినిమాలు రెడీ చేస్తున్నారట. అందులో ఒకటి బోయపాటి దర్శకత్వంలో ఉంటుందని సమాచారం. మరొక సినిమా కోసం అనిల్ రావిపూడి ని దర్శకుడిగా అనుకుంటున్నాట్లు టాక్ నడుస్తోంది.

Read More: Devara చుట్టూ సందేహాలు, ఆటంకాలు మాత్రమేనా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu