దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. బాలీవుడ్‌ని కూడా కరోనా మహమ్మారి బెదరగొడుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కరోనాబారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ నటి కుమారి సింగ్ సహా ఆమె కుటుంబం మొత్తానికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వెంటనే వారిని ఐసోలేషన్‌కు తరలించారు. తామంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆమె భర్త సుయేష్ రావత్, మామ సత్పాల్ మహారాజ్‌కు వ్యాధి సోకిందని చెప్పారు. త్వరలోనే కోలుకుంటామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.