HomeTelugu Trendingమోహన్‌లాల్‌ కసరత్తుల వీడియో.. వైరల్‌

మోహన్‌లాల్‌ కసరత్తుల వీడియో.. వైరల్‌

Mohanlal shares fitness vid

మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ 60 యేళ్ళకు చేరుకున్న యంగ్‌ హీరోలకు దీటుగా స్టంట్స్‌ చేయగలరు. ‘మన్యంపులి’ సినిమాలో ఆ ఎనర్జీ కనిపిస్తుంది. అందుకు ప్రధాన కారణం ఆయన ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యమివ్వటమే. తాజాగా తన అభిమానుల్లో శారీరక దారుఢ్యంపై స్ఫూర్తి నింపేందుకు మూడు నిమిషాల కసరత్తుల వీడియోను ఇటీవల ఇన్‌స్టా ద్వారా షేర్‌ చేశారు.

జిమ్‌లో ట్రైనర్‌ పర్యవేక్షణలో బ్యాటిల్‌ రోప్‌, లిఫ్టింగ్స్‌, బెంచ్‌ ప్రెస్‌, క్రంచస్‌ వంటి కసరత్తులను ‘నెక్స్ట్‌’అంటూ వరుసపెట్టి చేసేశారు. ఆ వీడియోకి క్యాప్షన్‌గా ‘రోజూ కసరత్తుల ద్వారా దేహంతోపాటు మెదడు ఆరోగ్యంగా ఉంటుంది’ అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘సూపర్బ్‌ సార్‌’, ‘మీరు స్ఫూర్తివంతం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఈ వీడియోను 8లక్షలకు పైగా వీక్షించారు.

https://www.instagram.com/tv/CMUlURfHk3X/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu