మలయాళ అగ్రహీరో మోహన్ లాల్, ప్రియదర్శన్ కాంబినేషన్లో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘ఒప్పమ్’. ఈ చిత్రం మలయాళంలో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. మలయాళంలో మూడు వారాల్లోనే 27 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి… దృశ్యం, ప్రేమమ్ చిత్రాల కలెక్షన్స్ ను క్రాస్ చేసి సంచలనం సృష్టించింది. మలయాళ ప్రేక్షకులను ఇంతలా ఆకట్టుకున్న ఒప్పమ్ కథ ఏమిటంటే….ఈ చిత్రంలో మోహన్ లాల్ గుడ్డివాడిగా నటించారు. అయితే గుడ్డివాడైన మోహన్ లాల్ ఓ అపార్టెమెంట్ లో లిఫ్ట్ ఆపరేటర్ గా వర్క్ చేస్తుంటాడు. ఒక రోజు ఆ అపార్ట్ మెంట్ లో మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ చేసిన కిల్లర్ తప్పించుకుంటాడు. అయితే….మర్డర్ చేసిన కిల్లర్ ను గుడ్డివాడైన మోహన్ లాల్ ఎలా పట్టుకున్నాడు అనేది ఒప్పమ్ కథ. ఇంట్రస్టింగ్ గా ఉన్న ఆ పాయింట్ నచ్చడంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి కొంత మంది నిర్మాతలు ప్రయత్నించారు. అయితే…ఒప్పమ్ చిత్రం తెలుగు డబ్బింగ్ & రీమేక్ రైట్స్ ను ఓవర్ సీస్ నెట్ వర్క్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో ఓవర్ సీస్ ఎంటర్ టైన్మెంట్ అధినేత బి.దిలిప్ కుమార్ తో కలిసి మోహన్ లాల్ అందిస్తుండడం విశేషం. మనమంతా, జనతా గ్యారేజ్ చిత్రాల విజయాలతో మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. దీంతో ఒప్పమ్ మూవీపై టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. మనమంతా, జనతా గ్యారేజ్ చిత్రాలతో వరుసగా సక్సెస్ సాధించిన మోహన్ లాల్ ఒప్పమ్ తో తెలుగులో హ్యాట్రిక్ సాధిస్తారనే అంచనాలు ఉన్నాయి. అయితే…ఒప్పమ్ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేస్తారా..? లేక రీమేక్ చేస్తారా అనేది త్వరలో తెలియచేయనున్నారు.