HomeTelugu Newsఈ సమయంలో ఆ ప్రశ్న అడగటానికి సిగ్గులేదు

ఈ సమయంలో ఆ ప్రశ్న అడగటానికి సిగ్గులేదు

కేరళ వరద బాధితులకు సాయం చేసేందుకు ఇటీవల మోహన్‌లాల్‌ వెల్లింగ్టన్‌ ద్వీపానికి వెళ్లారు. అక్కడ ఉన్న ఓ విలేకరి అత్యాచార ఘటనపై స్పందించాల్సిందిగా మోహన్‌లాల్‌ను కోరారు. దాంతో మోహాన్‌ లాల్‌ అతనిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

4 17

‘ఇలాంటి సమయంలో అవసరంలేని ప్రశ్నలు అడగటానికి సిగ్గుగా లేదు? ఇక్కడ జరుగుతున్న ముఖ్యమైన కార్యక్రమానికి, అత్యాచార ఘటనకు సంబంధం ఏంటి? కేరళలో వరదల కారణంగా విపత్తు కలిగినప్పుడు ఆ నేపథ్యానికి సంబంధించిన ప్రశ్నలు అడగచ్చు కదా. నేను మంచి విషయాల గురించి మాట్లాడుతుంటే మీరు అత్యాచారం గురించి అడుగుతారేంటి? అసలు నేను వచ్చిన పనికి, క్రైస్తవ సన్యాసినులకు ఏమన్నా సంబంధం ఉందా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలోనూ మోహన్‌లాల్‌ పాల్గొనకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఇటీవల కేరళకు చెందిన ఓ క్రైస్తవ సన్యాసినిపై అత్యాచారం జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu