టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మలయాళ బ్లాక్ బస్టర్ `లూసీఫర్’ రీమేక్ ‘153వ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ఆయన స్క్రిప్టు, దర్శకుడిని ఫైనల్ చేశారు. ఓ వైపు ఆచార్య షూటింగ్ కొనసాగుతుండగానే, లూసిఫర్ రీమేక్ పనులతో బిజీ అయ్యారు. సంక్రాంతి తర్వాత ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. లూసీఫర్ సినిమా స్క్రిప్టు ఫైనల్ అయ్యిందని తెలిపారు. `తనిఒరువన్` (ధృవ) ఫేం మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారని పేర్కొన్నారు. ‘‘రీమేక్ కథ ఓకే అయ్యింది. మన నేటివిటీకి తగ్గట్టుగా ఈ ప్రతిష్టాత్మక స్క్రిప్టును మోహన్ రాజా చాలా బాగా నేరేట్ చేశాడు. సంక్రాంతి తర్వాత సెట్స్‌కు వెళతాం. ఫిబ్రవరి-మార్చి – ఏప్రిల్ లో జరిగే షూటింగ్ తో నా 153 వ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. నాతో సినిమా చేయాలని వేచి చూస్తున్న చిరకాల సన్నిహితులు ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నా సినిమాల పంపిణీదారుడిగా ఆయనతో ఎంతో అనుబంధం ఉంది అని తెలిపారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అండ్ ఎన్.వి. ప్రసాద్ (ఎన్ .వి.ఆర్ సినిమా) సంయుక్తంగా నిర్మించనున్నారు.
With the blessings of my parents and well wishers, life has always gifted me better and bigger things.
And this time I’m more elated n honored to direct a mega project with the Megastar @KChiruTweets himself 🙏😇
Need all your wishes n prayers 🙏 #MegaStar153 pic.twitter.com/eJ05j2ia7v— Mohan Raja (@jayam_mohanraja) December 16, 2020