మహాభారతాన్ని ఒక్కో భాగంగా పూర్తి స్థాయిలో తెరకెక్కించాలనుందని గతంలో దర్శకరత్న దాసరి నారాయణరావు వెల్లడించారు. రాజమౌళి కూడా ఎప్పటికైనా మహాభారతాన్ని సినిమాగా చేస్తానని అన్నారు. బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ కూడా మహాభారతం సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలా అందరి దృష్టి మహాభారతం మీద పడింది. ఇప్పుడు మలయాళ దర్శకనిర్మాతలు రెండు అడుగులు ముందుకు వేసి వెయ్యి కోట్ల బడ్జెట్ తో మహాభారతం సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్తమ్ బిఆర్ శెట్టి ఈ సినిమాను నిర్మించడానికి రెడీ అయ్యారు. శ్రీకుమార్ మీనన్ ఈ కథను డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఈ కథలో భీముడి పాత్రకు మోహన్ లాల్ ను ఎంపిక చేసుకున్నారు. అంతేకాదు సినిమాకు ది మహాభారత అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసుకున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు టాక్. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు.