డైలాగ్ కింగ్ మోహన్‌బాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమా పరిశ్రమలోకి వచ్చి.. విలన్‌గా మారి ఆ తరువాత హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. విలక్షణ నటుడు మోహన్ బాబు ఇప్పటి వరకు దాదాపు 500 సినిమాల్లో నటించారు. నటుడిగా సుదీర్ఘ ప్రయాణంలో మోహన్ బాబు ఎన్నో విలక్షణమైన పాత్రలు చేశారు. హీరోగా మారిన తరువాత మోహన్ బాబు విలన్ పాత్రలు చేయలేదు. ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు మోహన్‌బాబు తమిళ్ హీరో సూర్య సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న సూరరై పోట్రు సినిమాలో విలన్ రోల్ చాలా కీలకంగా ఉంటుందట. ఆ రోల్‌కు మోహన్‌బాబు మాత్రమే న్యాయం చేయగలరని ఆయన్ను ఒప్పించారట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి చెన్నై ఎయిర్ పోర్ట్ లో షూటింగ్ జరుగుతున్నది.