HomeTelugu Trendingమోహన్‌ బాబు పుట్టిన రోజు.. మంచు లక్ష్మి ట్వీట్

మోహన్‌ బాబు పుట్టిన రోజు.. మంచు లక్ష్మి ట్వీట్

3 18
నేడు టాలీవుడ్ డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పుట్టిన రోజు. ఇక కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయన పుట్టిన రోజు, శ్రీవిద్యానికేతన్‌లో జరగాల్సిన వార్షికోత్సవ వేడుకలను వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. తన నిర్ణయాన్ని సహృదయంతో అర్థం చేసుకొని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎవరూ తన వద్దకు రావొద్దని మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు.

మంచు మోహన్‌ బాబుకి సీనీ, రాజకీయ ప్రముఖలు పుట్టినరోజు శుభాకాంక్షలు సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు. ఇక ఆయన కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న సోషల్ మీడియాలో ఆయన ఫొటోను పోస్ట్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ” మా నాన్న పుట్టినరోజు. ప్రతీ సంవత్సరం ఈ రోజు ఓ పండుగ! మీరు నిజంగా వన్‌ మ్యాన్‌ ఆర్మీ! లవ్‌ యూ టు ది మూన్‌ అండ్‌ బ్యాక్‌.’ అంటూ ట్వీట్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu