HomeTelugu Trendingక్రికెటర్‌ కైఫ్ తో బాలీవుడ్‌ బార్బీ కత్రినా కైఫ్‌!

క్రికెటర్‌ కైఫ్ తో బాలీవుడ్‌ బార్బీ కత్రినా కైఫ్‌!

7 4టీమిండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌, బాలీవుడ్‌ బార్బీ కత్రినా కైఫ్‌ ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు కాకపోయినా వారి పేర్లు ఒకేరకంగా ఉంటాయి. దీంతో నెటిజన్లు ఇటు కత్రినాను, అటు మహ్మద్‌ కైఫ్‌ను అప్పుడప్పుడూ ఆటపట్టిస్తూ ఉంటారు. ఎన్నో రోజుల నుంచి ఇలాంటి కామెంట్లు వస్తున్నప్పటికీ వీరిద్దరు ఎప్పుడూ ఎదురుపడింది లేదు. ‘భారత్‌’ సినిమా ప్రచారంలో భాగంగాలో బుధవారం ఓ ఛానల్‌ నిర్వహించిన కార్యక్రమంలో వీళ్లిద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘కైఫ్‌’ ద్వయం ఫొటో పోజు ఇచ్చింది. దీన్ని మహ్మద్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఎట్టకేలకు కత్రినాను కలుసుకున్నాను.ఇప్పటి వరకు మా మధ్య ఎలాంటి బంధుత్వం లేదు. మానవత్వం తప్ప’ అంటూ కత్రినాతో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటో వైరల్‌ అవుతోంది. కైఫ్‌ స్వ్కేర్‌ను ఒకేసారి చూడాలన్న కల ఇప్పటికి తీరిందని కామెంట్లు పెడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu