దేశంలో బాణాసంచా విక్రయాలపై నిషేధం లేదని ఇప్పటికే తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు… విక్రయాలపై కొన్ని షరతులు విధించింది. ఆన్‌లైన్ లో బాణా సంచా విక్రయాలను నిషేధించింది. పర్యావరణానికి హాని కలిగించని గ్రీన్ క్రాకర్స్ ను కాల్చాలని సూచించింది. దీపావళి రోజున రాత్రి 8 గంటల నుంచి 10 గంటల లోపు బాణాసంచాను కాల్చాలని… న్యూ ఇయర్ రోజు, క్రిస్మస్ వేడుకల్లో రాత్రి 11.45 నుంచి 12.30లోపు బాణాసంచా కాల్చుకోవాలని ఇప్పటికే తీర్పు వెలువరించిన జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం.. ఈ ఉత్తర్వులను సరవించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. సుప్రీం తీర్పుపై తమిళనాడు మళ్లీ కోర్టును ఆశ్రయించింది. రాత్రి సమయంలోనే కాకుండా.. ఉదయం కూడా తాము బాణాసంచా కాల్చుకుంటామని సుప్రీంకోర్టుకు విన్నవించింది తమిళనాడు.. అయితే తమిళనాడు వాదనలు విన్న సుప్రీంకోర్టు.. గత తీర్పులో ఇచ్చిన సమయాన్ని సవరించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. సవరించిన సమయంలో సహా సుప్రీంకోర్టు త్వరలోనే తీర్పును వెలువరించనుంది. అయితే గతంలో సుప్రీం వెలువరించిన తీర్పు, దేశ రాజధాని ఢిల్లీ, ఢిల్లీ పరిసర ప్రాంతాలకే వర్తిస్తుంది… మిగతా రాష్ట్రాల్లో టపాసుల సమయంపై ఆయా రాష్ట్రాల కోర్టులు నిర్ణయం తీసుకుంటాయని వెల్లడించింది సుప్రీంకోర్టు.