ప్రధానమంత్రి నరేంద్రమోడీ భారతీయులంతా ఏకమై కరోనాను తరిమికొడతారని అన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని వీడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
” మేము ఒక్కరమే ఇంట్లో ఉంటే ఏమి సాధిస్తామని ప్రజలు అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటే కరోనాను జయించినట్లే. జనతా కర్ఫ్యూ ద్వారా భారతీయులు తమ శక్తి సామర్థ్యాలు చాటారు. భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు మన బాటలోనే నడుస్తున్నాయి. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా పాటించాలి. ఈ ఆదివారం దేశ ప్రజలంతా కరోనాను తిప్పికొట్టే సంకల్పం తీసుకోవాలి. ఆదివారం రాత్రి 9గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు బంద్ చేసి కొవ్వొత్తులు, దీపాలు, లేదా మొబైల్ ఫ్లాష్ లైట్లు ఆన్ చేయండి. 130 కోట్ల మంది ..ఈ సమయాన్ని నాకు ఇవ్వాలని కోరుతున్నా. సంకట సమయంలో ఇది భారతీయులకు శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది. మన సంకల్పాన్ని మించిన శక్తి ప్రపంచంలో ఏదీ ఉండదు. కరోనాపై పోరాడుతున్న అందరికీ ధన్యవాదాలు” అని మోడీ అన్నారు. ఇవాళ దేశ ప్రజలకు వీడియో సందేశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ… పై అంశాలపై పిలుపునిచ్చారు.