వైసీపీ ఎమ్మెల్యే రోజా.. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్న శాశన మండలి అవసరం లేదని ప్రజలు కోరుతున్నారని వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆమె, గత ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయినా టిడిపి అధినేత చంద్రబాబుకి అహంకారం తగ్గలేదని రోజా అన్నారు. ప్రజా తీర్పును టిడిపి అపహాస్యం చేసిందని ఆమె అన్నారు. బేరసారాలు చేస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె విమర్శించారు. పెద్దల సభకు పెద్దలను పంపాలి కానీ దద్దమ్మలను కాదని ఆమె వ్యాఖ్యానించారు. వ్యవస్థను భ్రష్టు పట్టించడం లో చంద్రబాబు డ్రైవర్ ఐతే, యనమల స్టీరింగ్ అని ఆమె అన్నారు.
పెద్దల సభ దివంగత నేత వైఎస్ ఏర్పాటు చేస్తే.. ఈరోజు చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని అన్నారు. అమరావతి భూములు కాపాడుకోవడం కోసమే పోరాటం చేస్తున్నారని ఆమె అన్నారు. బాగా బలిసిన కోడి.. చికెన్ షాప్ కు వెళ్తే.. ఏమవుతుందో.. లోకేష్ గ్రహించాలని ఆమె అన్నారు. యనమల మహా మేధావిగా ఫీల్ అవుతున్నారని ఆయన రెండు సార్లు ఓడిపోయారని అన్నారు. రాయలసీమ, ఉత్తరాంద్ర అభివృద్ధి వ్యతిరేకిస్తున్న శాసన మండలి అవసరం లేదని అంటున్నారని అన్నారు. తెలంగాణ లో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు చేసిన వెధవ పనులు.. మిగిలిన వాళ్ళు ఎవరు చేయరని అన్నారు.