యంగ్ రెబట్ స్టార్ ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఆయన సినిమాలకి మంచి మార్కెట్ ఉండటంతో, నిర్మాతలు ఖర్చుకు వెనుకాడటం లేదు. ఇతర భాషల్లోను విడుదల చేస్తుండటం వలన, బాలీవుడ్ ఆర్టిస్టులు ప్రభాస్ సినిమాల్లో నటించడాని మొగ్గు చూపుతున్నారు.
ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా కోసం ‘రాధే శ్యామ్’ .. ‘ఓ డియర్’ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక ‘మైనే ప్యార్ కియా’ ఫేమ్ భాగ్యశ్రీ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర కోసం ‘మిథున్ చక్రవర్తి’ ని తీసుకున్నారనేది తాజా సమాచారం. అది విలన్ పాత్ర అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు.