సాధారణంగా ఓ కమర్షియల్ సినిమా రన్ టైమ్ రెండు గంటల 20 నిమిషాలు ఉంటుంది. వీలైతే రెండు గంటల్లోనే సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నారు చాలా మంది దర్శకులు. ఎందుకంటే ఎంత క్రిస్పీగా సినిమా ప్రేక్షకులను అంతగా కనెక్ట్ అవుతుంది. కావాలని ల్యాగ్ పెట్టి సినిమాను సాగదీస్తే మాత్రం చూడడానికి ఎవరు ఇష్టపడడం లేదు. బాహుబలి లాంటి సినిమా రన్ టైమ్ రెండు గంటల 50 నిమిషాలకు కుదించి తీస్తుంటే.. ఓ కమర్షియల్ సినిమా మాత్రం తన సినిమా వ్యవధిని రెండు గంటల 40 నిమిషాలకు చేసింది.
ఆ సినిమా మరేంటో కాదు.. వరుణ్ తేజ్ నటించిన ‘మిస్టర్’. ఇది వరకటితో పోలిస్తే ఇప్పుడు రెండు గంటలకు మించి సినిమా చూడాలనే ఆశక్తి చాలా మందిలో తగ్గింది. ఈ నేపధ్యంలో పక్కా ఫార్మాట్ లో వస్తోన్న ‘మిస్టర్’ సినిమా మాత్రం ఎక్కువ రన్ టైమ్ తో ప్రేక్షకులను అలరిస్తా అంటోంది. సినిమాపై మేకర్స్ ఎంత నమ్మకంగా ఉన్నా.. ఈ రన్ టైమ్ మాత్రం ఎక్కడో తేడా కొడుతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రన్ టైమ్ అనేది సినిమా రిజల్ట్ మీద ప్రభావం చూపిస్తుంది. సినిమాను ఎక్కువగా ప్రేమించి కట్ చేయలేకపోతే మాత్రం తరువాత ఖచ్చితంగా బాధ పడాల్సి వస్తుంది!