HomeTelugu Newsడిస్ట్రిబ్యూటర్లను ముంచేసిన అఖిల్‌

డిస్ట్రిబ్యూటర్లను ముంచేసిన అఖిల్‌

12 8అక్కినేని యంగ్‌ హీరో తెరంగేట్రం చేసిన అఖిల్ ఏన్నో అంచనాలతో వచ్చిన తొలి సినిమా “అఖిల్” డిజాస్టర్ కావడంతో ఇండస్ట్రీ మొత్తం షాకైంది. ఈ దెబ్బతో కొద్దిరోజులు గ్యాప్ తీసుకుని “హలో” అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే అటు నుంచి ప్రేక్షకులు మాత్రం అతడికి హలో చెప్పలేకపోవడంతో రెండో సినిమా కూడా ప్లాప్ అయింది. ఇక మూడో ప్రయత్నంగా తెరకెక్కించిన “మిస్టర్ మజ్ను” తో అయినా హిట్ కొడదామనుకుంటే ఆ సినిమా మరీ దారుణ ఫలితాన్ని ఇచ్చింది.

“తొలిప్రేమ” తో హిట్ అందుకున్న వెంకీ అట్లూరి, అఖిల్ కాంబోపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు వేసుకున్నారు. తీరా సినిమా విడుదలయ్యాక అంచనాలన్నీ తలకిందులయ్యాయి. పది రోజులకే అన్ని థియేటర్లలో సినిమా తీసేసిన పరిస్థితి. దీంతో ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా ఉండటంతో డ్రిస్టిబ్యూటర్లకు పీడకల మిగిల్చింది. మిస్టర్ మజ్ను బిజినెస్ రూ.12.82 కోట్లకు క్లోజ్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.23కోట్ల వరకు జరిగింది. అంటే అందులో కేవలం సగం మాత్రమే రాబట్టినట్లు లెక్కలు చెబుతున్నాయి.

“మిస్టర్ మజ్ను” తెలుగు రాష్ట్రాల్లో రూ.10.42 కోట్లు వసూలు చేయగా.. యూఎస్‌లో కేవలం రూ.75 లక్షలే వసూలు చేసినట్లు సమాచారం. చిన్నా చితకా హీరోల సినిమాలే యూఎస్‌లో డాలర్ల పంట పండిస్తుంటే స్టార్ల కుటుంబం నుంచి వచ్చిన అఖిల్ సినిమా కనీసం రూ.కోటి కూడా వసూలు చేయకపోవడం అక్కినేని అభిమానులకు చేదువార్తే. ఈ సినిమా ఇచ్చిన షాక్ నుంచి అఖిల్ ఇప్పట్లో తేరుకుంటాడో లేదో వేచి చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu