యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన హిట్ మూవీ మిర్చి. ఈ సినిమాతో కొరటాల శివ దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు. ప్రభాస్ ను తెరపై చూపించిన విధానం ఆకట్టుకుంది. చాలా స్టైలిష్ గా చూపిస్తూ… అదే సమయంలో సినిమాను తెరక్కించిన విధానం సినిమాకు హైలైట్ అయ్యింది. సినిమా సూపర్ హిట్ కావడంతో.. కొరటాల దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
తరువాత చేసిన శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలు విజయాలు సాధించాయి. రాజమౌళి బాటలోనే పరాజయం లేని దర్శకుడిగా కొరటాల ప్రయాణం సాగిస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల మెగాస్టార్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నవంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది. ఈ సినిమా తరువాత ప్రభాస్ తో కొరటాల సినిమా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.