Homeతెలుగు News100 కంపెనీలు టార్గెట్‌.. కానీ 1000 తీసుకురాగలమనే ధీమా

100 కంపెనీలు టార్గెట్‌.. కానీ 1000 తీసుకురాగలమనే ధీమా

తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్ లో ఆయననంద్ తో కలిసి చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించిన ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి తిరుపతిని వేదిక చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో మొదట్లో నేను 100 కంపెనీలు తీసుకురావాలని టార్గెట్‌గా పెట్టుకున్నాను… కానీ, చైనా పర్యటన తర్వాత కనీసం వెయ్యి కంపెనీలను తీసుకురాగలమనే ధీమా వచ్చిందన్నారు ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ తెలిపారు.చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలో ఎలక్ట్రానిక్స్ అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయన్న ఐటీ మంత్రి… దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో మనకు పెద్దగా పోటీ లేదని… మన రాష్ట్రానికి ప్రపంచంలో ఉన్న అతి పెద్ద మొబైల్ తయారీ కంపెనీలు, కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు వస్తున్నాయని వెల్లడించారు.

7 3

వచ్చే కంపెనీలకు కావాల్సిన మౌలిక వసతులు మన దగ్గర ఉన్నాయన్న మంత్రి లోకేష్… 2040 నాటికి మన దేశంలో 6 లక్షల కోట్ల రూపాయిల విలువైన ఎలక్ట్రానిక్స్ వినియోగించబోతున్నారు అనే అంచనా ఉందన్నారు. అందులో కనీసం 50 శాతం, 3 లక్షల కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఏపీలో తయారయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని… లక్ష్యాన్ని చేరుకోవడానికి అధికారుల సహకారం కావాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి వచ్చే కంపెనీలు ఇబ్బంది పడకుండా అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పించాలని సూచించిన మంత్రి… ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం లో ఉన్న కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయని… చైనా కంపెనీలు మొదటిసారి దేశం దాటి ఆంధ్రకి వస్తున్నాయని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధికి ప్రత్యేకంగా 25 మందితో ప్రమోషన్స్ టీం కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించిన లోకేష్… యూరోప్, తైవాన్ దేశాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రత్యేక డెస్క్ లు ఏర్పాటు చేస్తున్నామని… కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, మెడికల్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉన్న కంపెనీలను తీసుకొచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో కంపెనీలను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్న భూములు గుర్తించడం, రోడ్లు, నీరు, విద్యుత్ ఇతర మౌలిక వసతుల కల్పన పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించిన మంత్రి… వాక్ టూ వర్క్ అనే మోడల్ సిద్ధం చెయ్యాలి… కంపెనీలకు సమావేశంలో ఇళ్ల నిర్మాణం, స్కూల్స్, హాస్పిటల్స్, హోటల్స్, ఎంటర్టైన్మెంట్… ఇలా అన్ని సిద్ధం చేయాలన్నారు. రాబోయే 20 సంవత్సలను దృష్టిలో పెట్టుకొని అర్బన్ ప్లానింగ్ ఉండాలని… సౌత్ ఇండియాలో ఉన్న ఐదు రాష్ట్రాలను కలుపుతూ బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ కేంద్రం ముందు పెట్టే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారని… కేంద్రం ఈ ప్రతిపాదన అంగీకరిస్తే రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగం అభివృద్ధికి మరింత ఉపయోగపడుతుందన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu