టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘మీటర్’. దర్శకుడు రమేష్ కాడూరి తెరకెక్కించిన ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది.
ఈ టీజర్ కిరణ్ అబ్బవం బాడీ లాంగ్వేజ్ కొత్తగా ట్రై చేశాడు. భాద్యత లేని పోలీస్ ఆఫీసర్ గా హీరో కనిపించాడు. హీరోయిన్ అతుల్య రవి లుక్ చాలా ఫ్రెష్‌గా ఉంది. ఫన్ ఎలిమెంట్స్ తో పాటుగా మాస్ సీన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ టీజర్ చూస్తున్నప్పుడు కచ్చితంగా ఎన్టీఆర్ నటించిన టెపంర్ సినిమా గుర్తుకు వస్తుంది.
ఈ సినిమాలో పోసాని , సప్తగిరి కీలక పాత్రలో నటిస్తున్నారు. వరుస ఫ్లాప్‌తో ఉన్న కిరణ్ అబ్బవరంకి ఈ సినిమా అయితన ప్లస్ అవుతుందేమో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు