జోనర్: రొమాంటిక్ ఎంటర్టైనర్
దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాత: రాజ్ కందుకూరి
కథ:
ఏ విషయంలో కూడా సొంతగా నిర్ణయం తీసుకోలేని మనస్తత్వం గలవాడు అరవింద్(శ్రీవిష్ణు). అలానే తనకు అమ్మాయిలంటే చాలా భయం. ఈ క్రమంలో ఇంట్లో అతడికి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తుంటారు. స్వేచ్చ(నివేతా) అరవింద్ ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తుంది. స్వేచ్చ తన లైఫ్ లోకి వచ్చిన తరువాత అరవింద్ లో చాలా మార్పులు వస్తాయి. ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకుంటే కొన్ని కారణాల వలన వాయిదా పడుతుంది. అదే సమయంలో ఆఫీస్ పని మీద ముంబై వెళ్తాడు అరవింది. అక్కడకు వెళ్ళిన కొన్నిరోజులకే మన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుందామని స్వేచ్చకు
చెబుతాడు అరవింద్. ఆ విధంగా చెప్పడానికి గల కారణాలు ఏంటి..? ముంబై లో అరవింద్ కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి..? చివరకు అరవింద్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు..? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్:
పాత్రలను డిజైన్ చేసిన తీరు
హీరో, హీరోయిన్ల నటన
స్క్రీన్ ప్లే
సంగీతం
మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్
కొన్ని చోట్ల సాగతీత
మొత్తంగా సినిమా ఎలా ఉందంటే:
కమర్షియల్ చిత్రాలతో బోర్ అయిపోతున్న ప్రేక్షకులకు ‘మెంటల్ మదిలో’ చిత్రం ఊరటగా నిలుస్తుంది. ప్రేమానుబంధాలు, చక్కటి సంగీతం వంటి అంశాలతో పడవ ప్రయాణంలా సాగింది ఈ సినిమా. దర్శకుడికి ఇది తొలి చిత్రమే అయినప్పటికీ బాగా డీల్ చేసాడు. కథనంలో వేగం తగ్గినప్పటికీ అందమైన ప్రేమకథను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఆవిష్కరించి సక్సెస్ అయ్యాడు. తన ప్రయత్నానికి సినిమాలో నటీనటులందరి సహాయం ప్లస్ అయింది. టెక్నికల్ టీం కష్టం ప్రతి ఫ్రేం లో కనిపిస్తుంది. పెళ్ళిచూపులు వంటి క్లాస్ ఎంటర్టైనర్ తో ఆకట్టుకున్న నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించిన ఈ ‘మెంటల్ మదిలో’ యూత్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం ఖాయం.
రేటింగ్: 3/5