HomeTelugu Newsహీరో గోపీచంద్ చేతులమీదుగా "మెంటల్" ఆడియో ఆవిష్కరణ

హీరో గోపీచంద్ చేతులమీదుగా “మెంటల్” ఆడియో ఆవిష్కరణ

హీరో గోపీచంద్ చేతులమీదుగా “మెంటల్” ఆడియో ఆవిష్కరణ

 

శ్రీకాంత్, అక్ష  హీరోహీరోయిన్ లుగా రాజా ఆర్ట్ ప్రొడక్షన్స్ మరియు సుబ్రమణ్య ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లలో సంయుక్త నిర్మాణంలో కరణం బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘మెంటల్’. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్ లో హీరో గోపీచంద్ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.  

ఈ సందర్బంగా హీరో గోపి చాంద్ మాట్లాడుతూ “శ్రీకాంత్ అన్న కమిట్మెంట్ ఉన్న హీరో కాబట్టి వంద సినిమాలు పూర్తి చేసాడు. అది మాకు సాధ్యం కాదు. ఈ ట్రైలర్స్ చూస్తుంటే ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. సంగీత దర్శకుడు సాయి కార్తిక్ పేరు ఈ మధ్య బాగా వినిపిస్తోంది. అతను ఈ చిత్రానికి కూడా మంచి సంగీతాన్ని అందించి ఉంటారు. ఈ సినిమా మంచి విజయం సాధించి యూనిట్ సభ్యులందరికీ మంచి పేరు తీసుకురావాలి” అని అన్నారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ “దర్శకుడు తీస్తున్న విధానం చూసి కొద్దిగా కంగారు పడ్డాను. ఈ సినిమా మరో ‘ఆపరేషన్ దుర్యోధన’ అవుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. నిమా అవుట్ పుట్ చూస్తే చాలా బాగా వచ్చింది. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది. అలాగే సాయి కార్తిక్ పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నా నా మాట కాదనలేక ఈ సినిమా చేసాడు. మంచి సంగీతాన్ని అందించాడు. దర్శక నిర్మాతలందరూ ఈ సినిమా కోసం చాల కష్టపడ్డారు. వారందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చి మరిన్ని చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. 

ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ కార్యక్రమంలో తొలుత సినిమా టీజర్ ను తమ్మారెడ్డి భరద్వాజ, ఇన్ కం ట్యాక్స్ కమీషనర్ మరియు దర్శకురాలైన వాణి ఎం కొసరాజులు ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు దాసరి ప్రసాద్ (ఏలూరు), అనగాని ప్రసాద్, శివాజీ రాజా, ప్రతాని రామకృష్ణ గౌడ్, మల్కాపురం శివకుమార్, శ్రీమిత్ర చౌదరి, జి.వి.లతో బాటు తెలంగాణా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు గోపి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఈ సినిమాలో సుహాసిని, నిఖిత, రచన మౌర్య, ముమైత్ ఖాన్, పోసాని, కోట, బ్రహ్మానందం మొదలైన వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం : సాయి కార్తీక్, ఎడిటింగ్ : కోటగిరి, ఫైట్స్ : రవి, కెమెరా : బుజ్జి, నిర్మాతలు : వి.వి.ఎస్.ఎన్.వి ప్రసాద్ దాసరి, వి.వి. దుర్గాప్రసాద్ అనగాని, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : కారణం బాబ్జి  

cleardot

Recent Articles English

Gallery

Recent Articles Telugu