యూట్యూబ్ స్టార్ సుమంత్ ప్రభాస్ నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం మేము ఫేమస్. నిన్న విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతుంది. రిలీజ్‌కు ముందు చేసిన ప్రమోషన్ కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. దానికి తోడు టీజర్,ట్రైలర్‌లు ముందు నుంచి మంచి బజ్‌ను క్రియేట్ చేసాయి.
తొలిరోజే కోటీ రూపాయిల గ్రాస్‌ను క్రాస్ చేసింది. చిన్న సినిమా అందులోనూ ఎప్పుడు చూడని మొహాలతో తెరకెక్కిన ఈ సినిమా ఆ రేంజ్ కలెక్షన్‌లు సాధించిందంటే మాములు విషయం కాదు. కాగా రిలీజ్‌కు ముందు యూనిక్ ప్రమోషన్‌లతో ఆకట్టుకున్న మేకర్స్ రిలీజ్ తర్వాత కూడా కొత్తగా ఆలోచిస్తూ సినిమాపై ఆసక్తిని కలిగించారు.
ఇక ఈ సినిమాకు అదిరిపోయే స్పందన రావడంతో చిత్రబృందం ప్రేక్షకులతో కలిసి సక్సెస్ సెలబ్రేట్ చేసుకోనున్నారు. ఈ క్రమంలో ఎర్రగడ్డలోని గోకుల్ థియేటర్‌లో (శనివారం) ఈ రోజు సాయంత్రం 6గంటల షోకు ఫ్రీగా సినిమా చూడొచ్చని మేకర్స్ తాజగా వెల్లడించారు. ఆధార్ కార్డ్ లేదా కాలేజీ ఐడి చూపించి థియేటర్‌లోకి రావొచ్చని వెల్లడించారు.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు