సోషల్ మీడియాలో ఇప్పటి వరకూ అనేక రకాల ఛాలెంజ్‌లు మనం చూశాం. అయితే, ఇప్పుడొక సరికొత్త ఛాలెంజ్ హాలీవుడ్ టు టాలీవుడ్ వరకూ సెలబ్రిటీలను ఓ ఊపు ఊపేస్తోంది. అదే ‘లింక్డ్ ఇన్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిండర్ మీమీ ఛాలెంజ్’. ప్రతి ఒక్కరూ ఈ నాలుగు సామాజిక మాధ్యమాల్లోని ఫొటోలను కలిపి ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. వీటిలో ఫేస్బుక్, లింక్డ్ఇన్లకు సంబంధించి హుందాగా ఉండే ఫొటోలను ఎంచుకుంటే, ఇన్‌స్టా, టింబర్ ఫొటోలు కాస్త అందంగా, చిలిపిగా ఉండే ఫొటోలను ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఈ మీమీ ఛాలెంజ్‌ను అమెరికన్సింగర్, పాటల రచయిత డాలీ పార్టన్ మొదలు పెట్టింది. నాలుగు సామాజిక మాధ్యమాల్లోని నాలుగు రకాల ఫొటోలను ఒక చోట చేర్చిఅభిమానులతో పంచుకోవడంతో ఇది కాస్తా వైరల్‌గా మారి, ఇంటర్నెట్ను ఊపేస్తోంది.. ఇప్పటివరకూ మన స్టార్స్ పంచుకున్న కొన్ని మీమీలను మీరూ చూసేయండి.