HomeTelugu Trendingఅల్లు అరవింద్ ఆఫీస్‌ ముందు ఆమూవీ టీమ్‌ గోల!

అల్లు అరవింద్ ఆఫీస్‌ ముందు ఆమూవీ టీమ్‌ గోల!

mem Famous Movie Promotion
‘రైటర్ పద్మభూషణ్’ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరి ఫిలింస్, చాయ్ బిస్కెట్ ఫిలింస్ కలిసి రూపొందించిన మరో ఆసక్తికరమైన చిత్రం ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఈ హిలేరియస్ మ్యూజికల్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ని అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ సంయుక్తంగా నిర్మించారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాశి ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ‘మేమ్ ఫేమస్’ టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది.

ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ విడుదల చేస్తుండటం విశేషం. ఈ విషయాన్ని ఈ మూవీ నిర్మాణ సంస్థ ఛాయ్ బిస్కెట్ ఫిలింస్ ఒక ఫన్నీ వీడియో ద్వారా ప్రకటించింది. గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు సుమంత్ ప్రభాస్ అండ్ టీం.. ‘చిన్నపిల్లలు తింటారు లిటిల్ హార్ట్స్.. మేమ్ ఫేమస్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంది గీతా ఆర్ట్స్’ అంటూ డప్పుల మోతతో డాన్సులు చేశారు. ఈ గోలకి ఆఫీసు గేటు తీసి లోపలికి వచ్చిన అల్లు అరవింద్.. ‘రేయ్, నేనెప్పుడు తీసుకున్నానురా?’ అని ఆశ్చర్యంగా ప్రశ్నించారు. ‘కొత్తోళ్లం సర్.. ఛాయ్ బిస్కెట్ సర్’ అని సుమంత్ ప్రభాస్ సమాధానం చెప్పడంతో అల్లు అరవింద్ హ్యాపీగా ఫీలై.. ’26 మే, డన్, అందరూ రండి థియేటర్‌కి’ అని అల్ ది బెస్ట్ చెప్పారు.

ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో యూత్‌ను ఆకట్టుకున్న ఈ సినిమాకు ఇప్పుడు గీతా ఆర్ట్స్ కూడా తోడవడంతో మరింత ప్రచారం జరగనుంది. ఇటీవల ‘వర్షం పడుతోంది చమ్ చమ్ చమ్… మే 26న మేమ్ ఫేమస్‌కి అందరూ కమ్ కమ్ కమ్’ అంటూ హీరో విజయ్ దేవరకొండ చేసిన డేట్ అనౌన్స్‌మెంట్ వీడియో కూడా వైరల్ అయ్యింది. ఈ చిత్రానికి కళ్యాణ్ నాయక్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలో. సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, కిరణ్ మచ్చ, అంజిమామ, శివ నందన్ ప్రధాన పాత్రలు పోషించారు.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu