టాలీవుడ్ నాని హీరోగా నటించిన ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది మెహరీన్ పిర్జాదా. తాజాగా ఆమె చెప్పిన న్యూస్‌తో అభిమానులు షాక్ అయ్యారు. ఇటీవల ఆమెకు హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లి కుదిరిన విషయం తెలిసిందే. గత మార్చిలో నిశ్చితార్థం కూడా జైపూర్ వేదికగా ఘనంగా జరిగింది. కాగా ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు మెహరీన్ స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఇరువురు ఇష్టపూర్వకంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు మెహరీన్ తెలిపింది. ఇక నుంచి భవ్య బిష్ణోయ్, అతని కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధం ఉండబోదని మెహరీన్ స్పష్టం చేసింది. తన వ్యక్తిగత గోప్యతను అందరూ గౌరవిస్తారని.. ఇక నుంచి తన అభిమానులను అలరించేందుకు సినిమాలు చేస్తానని ఆమె పేర్కొంది. ప్రస్తుతం మెహరీన్ ‘ఎఫ్3’లో హీరోయిన్‌గా నటిస్తుంది.
— Mehreen Pirzada👑 (@Mehreenpirzada) July 3, 2021