HomeTelugu Trendingకొడుకు రివీల్‌ చేసిన మేఘనా రాజ్‌

కొడుకు రివీల్‌ చేసిన మేఘనా రాజ్‌

Meghana raj reveals her son

దివంగత కన్నడ హీరో చిరంజీవి సర్జా భార్య, నటి మేఘనా రాజ్‌ తన కొడుకు పేరును వెల్లడించింది. తన బాబుకు రాయన్‌ రాజ్‌ సర్జా అని నామకరణం చేసినట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో బ్యూటిఫుల్‌ వీడియోను షేర్‌ చేసింది. ఇందులో భర్తతో కలిసి ఉన్న వీడియో క్లిప్పింగ్‌లను యాడ్‌ చేయడంతో పాటు కొడుకు ఆడుకుంటున్నట్లుగా చూపించింది. అనంతరం జూనియర్‌ చిరు పేరును రాయన్‌ అని పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

2018లో చిరంజీవి సర్జా, మేఘనా పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన రెండేళ్లకే చిరంజీవి సర్జా గతేడాది జూన్‌ 7వ తేదీన గుండెపోటుతో కన్నుమూశాడు. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న ఆమె అక్టోబర్‌ 22న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!