ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రధాన ప్రాజెక్ట్ రీ-టెండరింగ్‌తో సర్కార్ రూ.628 కోట్లు ఆదా చేస్తోంది. ప్రధాన ప్రాజెక్ట్ రీ టెండరింగ్‌తో ఏపీ సర్కార్‌కు రూ.628 కోట్లు ఆదాఅయ్యాయి. గతంలో కంటే 12.6 శాతం తక్కువకు పనులు చేసేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ముందుకొచ్చింది. రీటెండరింగ్‌లో ప్రభుత్వం రూ.4,987 కోట్లకు టెండర్ పిలవగా.. రూ.4,358 కోట్లకే మేఘా ఇంజనీరింగ్ టెండర్ వేయడంతో.. ఆ సంస్థకు పోలవరం టెండర్ దక్కింది. హెడ్ వర్క్స్, జల విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను ‘మేఘా’ చేపట్టనుంది. రీటెండర్లలో రూ.4,358 కోట్లను కోట్ చేసి ఎల్-1గా మేఘా ఇంజినీరింగ్ సంస్థ నిలిచింది. ఇక, కోర్టు అనుమతులు లభించిన వెంటనే పనులు ప్రారంభించనుంది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. కాగా, రివర్స్ టెండరింగ్‌లో భాగంగా పోలవరం కాంట్రాక్టును రద్దు చేసి తిరిగి టెండర్‌ను పిలిచిన సంగతి తెలిసింది. దేశంలో ఇంతవరకు ఎక్కడా లేని విధంగా ఎల్-1గా వచ్చిన సంస్థ కోట్ చేసిన ధరను ప్రాథమిక అంచనా వ్యయంగా పరిగణలోకి తీసుకుని దాని ఆధారంగా బిడ్డింగ్ నిర్వహించారు.