అక్కినేని అఖిల్ ‘అఖిల్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా నిరాశ పరచడంతో
దాదాపు సంవత్సరం దాటుతున్నా ఇప్పటికీ తన సినిమా మొదలుపెట్టలేదు. ఎవరితో సినిమా
చేయాలనే విషయంలో తర్జనభర్జనలనంతరం చివరగా విక్రమ్ కె కుమార్ ను దర్శకుడిగా
ఎన్నుకున్నారు. క్లాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న విక్రమ్ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన
స్క్రిప్ట్ పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. అయితే ఈ సినిమాలో అఖిల్ సరసన మొదట నివేదా
థామస్ ను తీసుకోవాలని అనుకున్నా.. ఫైనల్ గా మేఘాఆకాష్ ను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.
మేఘా ప్రస్తుతం ధనుష్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా ద్వారా పరిచయం
కానున్నారు. పూర్తి స్థాయిలో హీరోయిన్ గా పరిచయం కాకముందే.. అఖిల్ సినిమాలో అవకాశం
రావడం విశేషంగా చెప్పుకుంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని
నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.