HomeTelugu Big Storiesఘరానా మొగుడిపై చిరంజీవి ట్వీట్

ఘరానా మొగుడిపై చిరంజీవి ట్వీట్

1 9
1992లో విడుదలైన ఘరానా మొగుడు చిత్రం చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించారు. ఇప్పుడు ఈ చిత్రం 28 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ట్విట్టర్‌లో దర్శకుడు రాఘవేంద్రరావు తన అనుభూతిని పంచుకున్నారు. షూటింగ్ సమయంలో చిరంజీవికి సూచనలిస్తున్నఅప్పటి ఫొటోను షేర్‌ చేశారు.

దర్శకేంద్రుడి ట్వీట్‌పై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ఘరానా మొగుడు సృష్టించిన ఘనత మీదే రాఘవేంద్రరావు గారూ అంటూ రీ ట్వీట్ చేశారు. ఈ చిత్రం సృష్టించిన రికార్డులకంటే మీతో పనిచేసిన ప్రతిరోజూ నాకు ఓ మంచి జ్ఞాపకం అన్నారు. నటీనటులను పువ్వుల్లో ఒక్కోసారి పండ్లలో పెట్టి చూసుకుంటూ మంచి ఫలితం రాబట్టుకున్న ఘరానా దర్శకులు మీరు అంటూ ప్రశంసించారు. ఘరానా మొగుడు చిత్రానికి రాఘవేంద్రరావు, కీరవాణి, దేవీవరప్రసాద్ మూల స్తంభాలన్నారు. నా బాబాయ్‌తో కలిసి చేసిన ఈ సినిమా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇది మెగా స్పెషల్ ఫిలిం.. ఇదో మైలురాయి చిత్రం అన్నారు. నిర్మాత
దేవీవరప్రసాద్, సంగీత దర్శకుడు కీరవాణి, ఇంకా చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu