HomeTelugu Big StoriesSpirit సినిమాలో కనిపించనున్న మెగాస్టార్?

Spirit సినిమాలో కనిపించనున్న మెగాస్టార్?

Megastar to play a key role in Spirit?
Megastar to play a key role in Spirit?

Megastar in Spirit:

ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న భారీ ప్రాజెక్టు Spirit. పాన్-వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా, వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం.

ఇటీవల బాలీవుడ్ స్టార్ జంట సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఈ సినిమాలో విలన్ పాత్రలలో కనిపించనున్నారని వార్తలు వినిపించాయి. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

అంతేకాదు, మరో రూమర్ ప్రకారం మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి కూడా ఈ భారీ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. ఈ వార్తకు సంబంధించిన సమాచారం కూడా ఇంకా బయటకి రావాల్సి ఉంది.

ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌లో విడుదల చేయనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నారు.

ప్రస్తుతానికి ఇతర ప్రముఖ నటీనటుల వివరాలు ప్రకటించలేదు కానీ, మరిన్ని స్టార్ నటులు ఈ సినిమాలో భాగం కానున్నారని కామెంట్స్ మాత్రం వినిపిస్తున్నాయి.

Read More: Megastar Chiranjeevi ఊటీ లో కొన్న ప్రాపర్టీ కి ఎంత ఖర్చయిందో తెలుసా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu