HomeTelugu Trendingఆ విషయంలో చిరంజీవి, చరణ్‌ గొడవపడేవారు: సుష్మిత

ఆ విషయంలో చిరంజీవి, చరణ్‌ గొడవపడేవారు: సుష్మిత

11 16

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రం అక్టోబర్ 2 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సినిమా కోసం యూనిట్ రెండేళ్లకు పైగా కష్టపడింది. కథ దగ్గరి నుంచి కాస్ట్యూమ్ వరకు ప్రతి ఒక్కటి జాగ్రత్తగా డిజైన్ చేశారు. ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారట. అయితే, బెస్ట్ విషయంలో నిర్మాత ఎక్కడా రాజీపడలేదని, కాస్ట్యూమ్ విషయంలో కూడా బెస్ట్ డిజైన్ వచ్చే వరకు చరణ్ వదిలేవాడు కాదని చరణ్ అక్కయ్య, మెగాస్టార్ పెద్ద కూతురు సుష్మిత పేర్కొంది.

కాస్ట్యూమ్స్ విషయంలోనే కాకుండా.. నటన విషయంలో కూడా చరణ్ రాజీపడేవాడు కాదట. ఈ విషయంలో ఒక్కోసారి మెగాస్టార్ తో చరణ్ గొడవపడేవాడని సుష్మిత పేర్కొంది. ఒక్కోసారి తన దగ్గరకు వచ్చి.. చిరంజీవిని ఒప్పించాలని తనకు ఆదేశాలు ఇచ్చేవాడని, మెగాస్టార్ ను ఒప్పించడానికి చాలా కష్టపడ్డానని చెప్పింది సుష్మిత. మెగాస్టార్ సినిమాలకు సుష్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu