చిరంజీవి వరుస ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నారు. యంగ్ హీరోల కంటే కూడా ఎక్కువగా కష్టపడుతున్నారు. వరుసగా సినిమాల చేసేందుకు రెడీ అవుతున్నారు. తన తదుపరి ప్రాజెక్టుల కోసం వరుసగా యంగ్ డైరెక్టర్లను లైన్లో పెడుతున్నారు. అనిల్ రావిపూడి, కల్యాణ్ కృష్ణ, శ్రీవశిష్ఠలతో సినిమాలు చేయడానికి మెగాస్టార్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడితో యాక్షన్ కామెడీ, శ్రీవశిష్ఠతో ఫాంటసీ జోనర్లో మూవీస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
కల్యాణ్ కృష్ణతో చేయబోయే సినిమాలో ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ సినిమాలో చిరంజీవి ‘పాస్ పోర్టు ఆఫీసర్’ గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ పాత్రలో మెగాస్టార్ లుక్ అదిరిపోనుందని చెప్తున్నారు.
చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత తన సొంత బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది మలయాళంలో మోహన్ లాల్ చేసిన ఓ సినిమాకు రీమేక్ అని టాక్. త్రిష హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమాలో, శ్రీలీల ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది.
మరోవైపు కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగ మార్తాండ’ సినిమాకు చిరంజీవి వాయిస్ ఓవర్ చెప్పారు. ఈ సినిమాకు టాక్ తగ్గట్టు వసూళ్లు రాబట్టలేకపోయింది. ఈ కోవలో చిరంజీవికి ఓ కథను వినిపించినట్టు సమాచారం.
దర్శకుడు సంపత్ నందితో మెగాస్టార్ ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే సంపత్ నంది తాను రిజిస్టర్ చేసుకున్న ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌ను చిరు కోసం త్యాగం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంపత్ నంది సాయి తేజ్‌తో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత రజాకార్ల నేపథ్యంలో సినిమా చేసే అవకాశాలున్నాయి.