మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. ఇప్పటి వరకు తన అభిప్రాయాలను, మెసేజ్‌లను వీడియో రూపంలో లేదా స్టేట్‌మెంట్ రూపంలో విడుదల చేస్తూ వచ్చేవారు. అయితే ‘ఉగాది’ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు చిరు. ఇక, నేను కూడా సోషల్ మీడియాలోకి ఎంటర్ అవుదామనుకుంటున్నాను… దానికి కారణం ఎప్పటికప్పుడు నా భావాలను నా అభిమానులతో షేర్ చేసుకోవడానికి.. అలాగే, నేను ఇవ్వాలనుకునే మెసేజ్‌లు కానీ, చెప్పాలనుకునే విషయాలను కానీ.. ప్రజలతో చెప్పుకోవడానికి వేదికగా భావిస్తూ.. అందేకే నేను సోషల్ మీడియాలోకి ఎంటర్ అవుతున్నాను.. అది కూడా ఈ ఉగాది నుంచే అంటూ.. వీడియోలో పేర్కొన్నారు చిరంజీవి. ఇప్పటికే.. సోషల్ మీడియాలో పవన్ కల్యాన్ యాక్టివ్‌గా ఉంటారు.. ఆ తర్వాత అల్లు అర్జున్, వరుణ్ తేజ్.. ఇలా మెగా హీరోలు సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. ఇక, రామ్‌చరణ్ ఫేస్‌బుక్ ఖాతాను మాత్రమే వాడుతుంటారు. అప్పుడప్పుడు.. తన భార్య ఉపాసన ట్విట్టర్ ఖాతాలో మెరుస్తుంటారు. మొత్తానికి ఇప్పుడు మెగాస్టార్ సోషల్ మీడియా ఎంట్రీతో ఫ్యాన్స్‌కి ఫుల్ ఖుషిలో ఉన్నారు. అయితే, సోషల్ మీడియాలో చిరు.. ఏఏ ఖాతాలు ప్రారంభిస్తారో తెలుగు సంవత్సరాది నాడు తెలియనుంది.
This Ugadi is going to be special. Tomorrow, your Mega Star Chiranjeevi garu is going to start interacting with you from his official social media handles. Get ready to follow and show him some love.#WelcomeMegaStarToSM pic.twitter.com/2PwDM0TT7J
— Konidela Pro Company (@KonidelaPro) March 24, 2020