HomeTelugu Trendingమెగాస్టార్‌ న్యూలుక్‌.. వైరల్‌

మెగాస్టార్‌ న్యూలుక్‌.. వైరల్‌

2 3మెగాస్టార్ చిరంజీవి న్యూ లుక్‌లో ఉన్న ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలను చిరు కోడలు ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఆమె ‘బీ పాజిటివ్‌’ అనే హెల్త్‌ మ్యాగజైన్‌ నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాగజైన్‌ కవర్‌ పేజీ కోసం చిరు ఫొటోషూట్‌ చేయించారు. ఈ కొత్త లుక్‌లో చిరు అదిరిపోయారు.

చిరు ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, తమన్నా, అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. అక్టోబరు 2న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సినిమా విషయంలో ఉపాసనకు ఓ డౌట్ వచ్చింది. సైరా సినిమాను ఎందుకు చూడాలని ఉపాసన మెగాస్టార్ చిరంజీవిని ప్రశ్నించిందట. ఉపాసన అడిగిన ప్రశ్నకు మెగాస్టార్ అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. భారతీయులు ఇప్పుడు స్వేచ్చా వాయువులు పీల్చుకుంటూ..ఆనందంగా జీవిస్తున్నారంటే దాని వెనుక ఎందరో త్యాగమూర్తులు ఉన్నారని, వారి త్యాగం ఫలితంగానే దేశానికి స్వాతంత్రం వచ్చిందని అన్నారు. అలాంటి త్యాగమూర్తుల్లో ఒకరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అయన గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఆయన చేసిన పోరాటం గురించి అందరికి తెలియాలి. అందరికి అర్ధమయ్యే రీతిలో చెప్పగలిగేది సినిమా ఒక్కటే.. చెప్పే విధానం బాగుంటే ప్రజలు అలాంటి వ్యక్తి గురించి తప్పకుండా తెలుసుకుంటారు.. వారి కథను గురించి వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి..అని ఉపాసనకు మెగాస్టార్ వివరణ ఇచ్చారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu