భారీ చిత్రాల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న భవ్య క్రియేషన్స్ సంస్థ తొలిసారిగా కొత్త హీరోహీరోయిన్, కొత్త దర్శకుడితో నిర్మించిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. సరికొత్త కంటెంట్ ఫిల్మ్‌లో విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యా శెట్టి హీరో హీరోయిన్లుగా, బ్రహ్మాజీ కీలకపాత్రలో నటించారు. అయితే ఇప్పటికే విడుదలైన టీజర్ ఈ సినిమా పైన అంచనాలను పెంచేసింది. అయితే ఈ సినిమా మార్చి 6న విడుదల కాబోతుంది. చెందు ముద్దు దర్శకత్వంలో వి.ఆనందప్రసాద్ ఈ చిత్రాని నిర్మించారు. మార్చి 1న హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘణంగా నిర్వహించబోతున్నారు చిత్ర బృందం. సినిమా నిర్మాత వి. ఆనందప్రసాద్ ఈవేడుక గురించి మాట్లాడుతూ.. ‘మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా చాలా గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనున్నాం. మెగాస్టార్ రాకతో మా సినిమాకి ఓ కొత్త ఊపు రాబోతుంది. ఆయన ఈ ఫంక్షన్‌కి రావడానికి అంగీకరించినందుకు చాలా చాలా థ్యాంక్స్’ అని అన్నారు.
Megastar #Chiranjeevi garu will be gracing the Pre Release event of #OPittaKatha on March 1st at ITC Kohenoor from 6PM onwards#OPittaKathaPreRelease@mynameisVISWANT @SanjayKOfficial @NityaMShetty @actorbrahmaji @BhavyaCreations @chendumuddhu #PraveenLakkaraju @MangoMusicLabel pic.twitter.com/kPOxIlNVJD
— BARaju (@baraju_SuperHit) February 28, 2020