గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమంలో భాగంగా జూబ్లీ హిల్స్ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ అండ్ జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ల ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ క్లబ్ ప్రాంగణంలో లక్ష మొక్కలు నాటే భారీ కార్యక్రమమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ డైరెక్టర్లు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి పాల్గొన్నారు. ‘హరితహారం’లో భాగంగా నడుస్తున్న ఈ కార్యక్రమంలో మొక్కలు నాటి.. భవిష్యత్తులో మొక్కల ఆవశ్యకత గురించి వివరించారు మెగాస్టార్.