Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పానవసరం లేదు. ఇటీవల పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. ఎన్నో ఏళ్లుగా అభిమానులు, ప్రేక్షకులను అలరిస్తున్నారు. టాలీవుడ్‌లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయం శక్తితో ఎదిగిన వ్యక్తి చిరంజీవి. చిరంజీని సినీ కెరీర్ ప్రారంభంలో విలన్ రోల్స్ చేసిన విషయం తెలిసిందే. తొలుత చాలా వరకు చిత్రాల్లో విలన్‌గా మెప్పించారు.
అంతేకాకుండా ఆ సమయంలో స్టార్ హీరోలకు సైతం విలన్‌గా నటించిన తనదైన ప్రతిభను చూపించారు. చిరంజీవి విలన్‌గా చేసిన హీరోల్లో దివంగత సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి కలిసి మొత్తం మూడు సినిమాల్లో నటించారు. అందులో ‘కొత్త అల్లుడు’ అనే మూవీ చిరంజీవి విలన్‌గా చేశారు.
1979లో విడుదలైన కొత్త అల్లుడు సినిమాలో హీరోగా సూపర్ స్టార్ కృష్ణ చేస్తే.. జయప్రద ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. సాంబశివరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కేవి మహదేవన్ సంగీతం అందించారు. ఈ మూవీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, కైకాల సత్యనారాయణతోపాటు మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీలో ఈ ముగ్గురు విలన్స్‌గా నటించడం విశేషం.
ఈ సినిమా 1979లో సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31 విడుదలై మంచి హిట్ అందుకుంది. దీనికి ఐమ్‌డీబీ రేటింగ్ 8.3 ఇవ్వడాన్ని బట్టి తెలుస్తోంది ఈ మూవీ అప్పట్లో ఎంత హిట్‌గా నిలిచిందో.
ఇక కొత్త అల్లుడు మూవీలో కృష్ణకు విలన్‌గా నటించిన చిరంజీవి మరో సినిమాలో గెస్ట్ రోల్ ప్లే చేశారు. ఆ సినిమానే కొత్తపేట రౌడీ ముళ్లపూడి వెంకట రమణ కథ, మాటలు అందించిన కొత్తపేట రౌడీ సినిమాకు కొత్త అల్లుడు డైరెక్టర్ సాంబశివరావు దర్శకత్వం వహించారు. ఆ సినిమా తర్వాతి సంవత్సరం 1980లో మార్చి 7న కొత్త అల్లుడు విడుదలైంది. ఇందులో కూడా జయప్రద హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రంలో ప్రసన్నకుమార్‌గా అతిథి పాత్ర చేశారు మెగాస్టార్ చిరంజీవి.
ఇక కృష్ణ-చిరంజీవి నటించిన మూడో సినిమా తోడు దొంగలు. ఈ సినిమాలో ఈ ఇద్దరు హీరోలుగా నటించడం విశేషం. ఆ సినిమా తర్వాతి సంవత్సరం అంటే 1981లో ఫిబ్రవరి 12న థియేటర్లలో రిలీజైంది. కే వాసు దర్శకత్వం వహించిన ఈ మూవీలో రావు గోపాల్ రావు, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, ఎమ్ ప్రభాకర్ రెడ్డి, సాక్షి రంగారావు, సారథి కీలక పాత్రలు పోషించారు.
ఇక హీరోయిన్స్‌గా నటి గీతా, మధుమాలిని చేశారు. బాలీవుడ్ నటి రేఖ ఓ రోల్ చేశారు. కాగా వరుసగా 1979, 80, 81 సంవత్సరాల్లో సూపర్ స్టార్ కృష్ణ చిరంజీవి కలిసి మూడు సినిమాల్లో నటించడం విశేషం. విలన్‌గా, గెస్ట్ రోల్‌లో, కృష్ణకు సమానంగా హీరోగా చిరంజీవి నటించడం ఆసక్తికరమైన విషయంగా చెప్పుకోవచ్చు.