తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ తన సత్తా మరోసారి చాటారు. తన ముందు ఎంత మంది యంగ్ హీరోలున్నా తన దూకుడు ముందు వారంతా బలాదూరేనని చిరంజీవి నిరూపించారు. తనపై ప్రేక్షకులకు అభిమానం తగ్గలేదని, తనలోని స్టామినా ఇంకా అయిపోలేదని సైరా నరసింహారెడ్డి కలెక్షన్ల ద్వారా తెలియజెప్పారు. రేనాటి సూర్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఓ చారిత్రాత్మిక చిత్రంతో మెగాస్టార్ కొత్త చరిత్రను లిఖించారు. ప్రభాస్ మినహా ఏ హీరోకి సాధ్యం కాని ఫీట్‌ను చిరంజీవి అందుకున్నారు. సైరా సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం రూ.100 కోట్ల షేర్ మార్క్‌ను అందుకున్నట్లు చెబుతున్నారు. 11 రోజుల్లో అంటే శనివారం నాటికి రూ.97.65 కోట్ల షేర్ రాబట్టిన మెగాస్టార్ సినిమా ఆదివారం రూ.100 కోట్ల మార్క్‌ను దాటేసింది. అతి తక్కువ రోజుల్లోనే బాహుబలి తర్వాత రూ.100 కోట్ల షేర్
రాబట్టిన మూవీగా సైరా నిలిచినట్టయింది.