HomeTelugu Trending‘మా’ ఎన్నికలపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

‘మా’ ఎన్నికలపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

Chiru at Pelli Sandadi

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ‘పెళ్లి సందD’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి వెంకటేశ్‌తో కలిసి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యారు. ఈసందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘మా’ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నారప్ప’ సినిమా నాకు బాగా నచ్చింది. ఆ సినిమా చూసిన వెంకటేశ్‌ని అభినందించాను. తనకి నేను నటించిన ‘సైరా’ బాగా నచ్చి, నన్ను మెచ్చుకున్నాడు. అందరి హీరోల మధ్య ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే పరిశ్రమలో వివాదాలు, కొట్టుకోవడం, ఒకరినొకరు మాటలు అనడం, అనిపించుకోవడం ఉండదు కదా అన్నారు.

పదవులు అనేవి చిన్న చిన్న బాధ్యతల్లాంటివి. ఏదైనా తాత్కాలికమే. అవి రెండేళ్లుంటాయా? మూడేళ్లుంటాయా? నాలుగేళ్లుంటాయా? వాటి కోసం మనం మాటలు అనడం, అనిపించుకోవడం చూస్తుంటే బయటివారికి ఎంత లోకువ అయిపోతాం? పదవి కోసం అంత లోకువ అవ్వాలా? అది నాకు బాధగా ఉంది. నేను ఏ ఒక్కరినీ వేలు పెట్టి చూపించడం లేదు. మన ఆధిపత్యం చూపించుకునేందుకు ఎదుటవారిని కించపరచాల్సిన అవసరం లేదు. ఇది ఎక్కడ ప్రారంభమైందో గుర్తుంచుకోండి. ఎవరి కారణంగా ఈ వివాదాలు మొదలయ్యాయో ఆలోచించండి. అలాంటి వ్యక్తిని దూరంగా ఉంచితేనే వసుధైక కుటుంబం అవుతుంది అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu