లాక్ డౌన్ సమయంలో అన్నీ రంగాలు మూతపడ్డాయి. ఇటు సినిమాలతో పాటు సీరియల్స్ షూటింగ్స్ అన్ని రద్దైయాయి. దీంతో సినీ ప్రముఖులంతా ఇంటికే పరిమితమైపోయారు. దీంతో పాటు ఇంట్లో ఉంటున్న హీరోయిన్లు ఇప్పుడు మేకప్ ఛాలెంజ్ ఒకటి స్టార్ట్ చేశారు. ఇప్పుడీ ఛాలెంజ్ ట్రెండ్ అవుతుంది. తాజాగా మెగా ఫ్యామిలీకి చెందిన లేడీస్ మేకప్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేశారు. ముందుగా చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఈ మేకప్ చాలెంజ్ ప్రారంభించింది. ఆ తర్వాత నిహారిక, చిన్న కూతురు శ్రీజతో పాటు అల్లు అర్జున్ భార్య స్నేహతో పాటు మిగిలిన మెగా ఫ్యామిలీకి చెందిన ఆడవాళ్లు ఇందులో భాగస్వాములు అయ్యారు. వీళ్లందరు కలిసి చేసిన ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.